CBI Recruitment 2025: 1040 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల

CBI Recruitment 2025: 1040 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు 2024: క్రెడిట్ ఆఫీసర్ నోటిఫికేషన్, 90,000+ జీతం, వెంటనే దరఖాస్తు చేయండి!

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. 1000 కి పైగా ఖాళీలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని కేటగిరీల వారికి ఖాళీలు కేటాయించారు. ఈ జాబ్‌లో చేరగానే మీకు స్టార్టింగ్ నెలకు 90,000 కి పైగా శాలరీ అనేది చెల్లిస్తారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి నెగటివ్ మార్కింగ్ విధానం కూడా లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి కంప్లీట్ గా వారే శిక్షణ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు. ఇది అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ వివరాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అవకాశం వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశవ్యాప్తంగా 4500 కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రస్తుతం క్రెడిట్ ఆఫీసర్ కి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి భారతీయ పౌరులందరి నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ వన్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మీ సొంత రాష్ట్రంలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది.

పోస్ట్ పేరు మరియు ఖాళీలు

క్రెడిట్ ఆఫీసర్ (JMGS స్కేల్ I) పోస్ట్ ల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. మొత్తం 1000 కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీల వారీగా ఖాళీలు కేటాయించారు.

వేతనం

ఈ పోస్టులకు ఎంపికైన వారికి జాబ్ లో చేరగానే నెలకు 90,000 కి పైగా శాలరీ అనేది పే చేస్తారు. పే స్కేల్ తో పాటు చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి

వయోపరిమితి కనీసం 20 సంవత్సరాలు నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు (జనరల్ కేటగిరీ) వరకు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

ఏ విభాగంలో డిగ్రీ పాసైనా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ అయినా అర్హులే. మీరు బీటెక్ లేదా బీఫార్మసీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. నవంబర్ 30 వరకు ఈ అర్హత కలిగి ఉంటే సరిపోతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎంపిక ప్రక్రియ

ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ విధానం లేదు, కాబట్టి మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు. ఇంటర్వ్యూ 50 మార్కులకు కండక్ట్ చేస్తారు, ఇందులో మీరు 25 మార్కులు వస్తే సరిపోతుంది.

శిక్షణ మరియు కోర్సు వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిజిడిబిఎఫ్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) కోర్సులో భాగంగా ఒక సంవత్సరం శిక్షణ అందిస్తుంది. ఈ ఒక సంవత్సరం శిక్షణలో మొదటి 9 నెలలు క్లాస్‌రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత 3 నెలలు ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. శిక్షణ పీరియడ్‌లో మొదటి 9 నెలలు నెలకు ₹2500, ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ లో నెలకు ₹10000 స్టైఫండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ చేరే సమయంలో ₹3 లక్షల నుంచి ₹4 లక్షల కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అయితే ఈ ఫీజు కోసం బ్యాంకే మీకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తుంది. మీరు ఐదు సంవత్సరాలు ఈ సంస్థలో విజయవంతంగా పనిచేసిన తర్వాత కోర్సు ఫీజును రీఇంబర్స్‌మెంట్ చేస్తారు.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఉమెన్ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ₹150.
  • మిగతా వారికి ₹750. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20. ఎక్కువ సమయం లేదు కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

పరీక్షా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

దరఖాస్తు విధానం

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై లింక్‌పై క్లిక్ చేసి, ముందుగా ప్రాథమిక వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత మీ ఫోటో, సంతకం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్‌రిటెన్ డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్‌ను సమర్పించాలి. సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

డిగ్రీ పాసైన వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.


Charan  - Content Writer
Charan I am Charan, a content writer at TopJobAlerts.com with over six years of experience in blogging and content writing. I have worked with multiple websites, creating high-quality, SEO-focused content across various niches, and have a strong track record of delivering engaging and informative articles. Read More

LATEST Post

© 2026 topjobalerts.com | All rights reserved | Made With By TopJobAlerts