---Advertisement---

01-02-2026 Gold Price Today | Hyderabad Latest Gold Rate

By Charan

Published on:

01-02-2026 Gold Price Today | Hyderabad Latest Gold Rate

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

బులియన్ మార్కెట్లో భారీగా కుప్పకూలిన బంగారం వెండి ధరలు

ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది ఒక అదిరే శుభవార్తగా చెప్పవచ్చు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దేశ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే ఈ భారీ పతనం చోటుచేసుకుంది.

ఈరోజు తులం బంగారం ధర దాదాపు ₹9,000 వరకు తగ్గగా, కిలో వెండి ధర ఏకంగా ₹85,000 మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరల పరిస్థితి

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కుప్పకూలాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు అవున్స్‌పై ఏకంగా 434 మేర తగ్గింది. దీని ప్రభావంతో అవున్స్ గోల్డ్ రేటు 4,893 స్థాయికి దిగివచ్చింది.

అలాగే స్పాట్ సిల్వర్ రేటు కూడా అవున్స్‌కు 29 డాలర్ల మేర తగ్గింది. దీంతో స్పాట్ వెండి ధర 85 డాలర్ల స్థాయికి పడిపోయింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. క్రితం రోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై ₹9,650 మేర తగ్గగా, ఈరోజు మరింతగా ₹8,620 మేర పడిపోయింది. దీని వల్ల తులం బంగారం ధర ₹1,60,580 వద్దకు దిగివచ్చింది.

22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర

22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధరలో కూడా భారీ తగ్గుదల నమోదైంది. నిన్నటి రోజున తులంపై ₹8,850 తగ్గిన రేటు, ఈరోజు మరోసారి ₹7,900 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర ₹1,47,200 స్థాయికి చేరుకుంది.

భారీగా తగ్గిన వెండి ధరల

బంగారాన్ని మించి పెరిగిన వెండి ధరలు అదే స్థాయిలో కుప్పకూలాయి. క్రితం రోజు కిలో వెండి ధర ₹20,000 తగ్గగా, ఈరోజు ఏకంగా ₹85,000 మేర పడిపోయింది. దీని ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹3,20,000 స్థాయికి తగ్గింది.

రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధర లక్ష రూపాయలకు పైగా పడిపోవడం గమనార్హం.

---Advertisement---

Leave a Comment

WhatsApp

📢 తాజా జాబ్స్ కోసం Join అవ్వండి!

ప్రతి రోజు తాజా ఉద్యోగ సమాచారం పొందండి.