10వ తరగతి అర్హత: రైల్వే గ్రూప్ D ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్

10వ తరగతి అర్హత: రైల్వే గ్రూప్ D ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్

రైల్వే గ్రూప్ డి పర్మనెంట్ ఉద్యోగాలు: టెన్త్ అర్హతతో రాత పరీక్ష లేకుండా సెలెక్షన్!

రైల్వే శాఖ నుండి కొత్తగా టెన్త్ క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ డి ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ క్లాస్ పాసైన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్‌గా ఎంపిక చేసి ఈ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 45,000 వరకు జీతం వస్తుంది.

ముఖ్యమైన వివరాలు

ఈ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) తమ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ జాబ్స్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్. ఎటువంటి కాంట్రాక్ట్ లేదా అప్రెంటిస్‌షిప్ ఖాళీలు కావు. ఇవన్నీ రైల్వేలో ఉండే పర్మనెంట్ ఉద్యోగాలు.

అర్హతలు

ఈ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనీస విద్యార్హత 10వ తరగతి పాసై ఉండాలి. మీరు ఇంటర్, డిగ్రీ, ఐటిఐ వంటి ఉన్నత విద్యార్హతలు చదివినా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి విషయానికి వస్తే, జనవరి 1, 2026 నాటికి అభ్యర్థులకు కనీసం 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి అని రిక్రూట్‌మెంట్ వివరాలలో స్పష్టంగా ఇచ్చారు.

జాబ్స్‌కు సంబంధించి సెలెక్ట్ అయితే, లెవెల్ 1 ప్రకారం, అన్ని అలవెన్స్‌లు కలుపుకుంటే నెలకు 45,000 వరకు జీతం పొందవచ్చు.

దరఖాస్తు రుసుము

అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎవరెంత చెల్లించాలంటే, SC, ST, అలాగే మహిళా అభ్యర్థులు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) వారు కేవలం ₹250 చెల్లించాలి. మీరు ట్రయల్ టెస్ట్‌కు అటెండ్ అయిన తర్వాత పూర్తి అమౌంట్ రీఫండ్ చేస్తారు. మిగతా అభ్యర్థులు ₹500 పే చేయాలి. మీరు ట్రయల్ టెస్ట్‌కు అటెండ్ అయిన తర్వాత ₹400 అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌కు క్రెడిట్ చేస్తారు.

ఎంపిక ప్రక్రియ (రాత పరీక్ష లేదు)

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రిటన్ టెస్ట్ ఉండదు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అభ్యర్థుల ఎంపిక స్పోర్ట్స్ సర్టిఫికెట్ మరియు స్పోర్ట్స్ స్కిల్ ఆధారంగా జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ లాగా ట్రయల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు కనీసం 60 మార్కులు వస్తే అర్హత సాధిస్తారు. ఇది జస్ట్ మీకు ఉన్నటువంటి స్కిల్స్‌కు సంబంధించి ట్రయల్ టెస్ట్ మాత్రమే.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 8వ తేదీన ప్రారంభమైంది.
  • దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
  • ట్రయల్ టెస్ట్ అంచనా తేదీ: ఫిబ్రవరి నెల.

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్‌గా 38 వేకెన్సీలను భర్తీ చేస్తున్నారు. ఏడవ CPC ప్రకారమే మీకు శాలరీ ఉంటుంది. ఓపెన్ అడ్వర్టైజ్‌మెంట్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇనిషియల్ పోస్టింగ్ నార్తన్ రైల్వేలో ఇస్తాము అని కూడా ఇక్కడ ఇచ్చారు.

వివిధ రకాల గేమ్స్‌కు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి: హాకీ (పురుషులు – 5), వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు – 1), బ్యాడ్మింటన్ (పురుషులు/మహిళలు), అథ్లెటిక్స్ (పురుషులు/మహిళలు), ఖో-ఖో, టేబుల్ టెన్నిస్, చెస్, స్విమ్మింగ్ (మహిళలు), లాన్ టెన్నిస్ (పురుషులు), క్రికెట్ (పురుషులు), కబడ్డీ (పురుషులు), ఫుట్‌బాల్ (పురుషులు), రెజ్లింగ్ (పురుషులు), బాస్కెట్‌బాల్ (పురుషులు). ఈ గేమ్స్‌కు సంబంధించి ఈవెంట్స్ అలాగే డివిజన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాలను నోటిఫికేషన్‌లో ఇచ్చారు.

క్రీడా అర్హతలు మరియు ఎంపిక ప్రమాణాలు

ఎంపిక ప్రక్రియ స్పోర్ట్స్ సర్టిఫికెట్ మరియు స్పోర్ట్స్ నైపుణ్యం ఆధారంగా ఉంటుంది. ట్రయల్ టెస్ట్‌లో గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, కోచ్ అబ్జర్వేషన్ అన్నీ చెక్ చేస్తారు. దీనికి 40 మార్కులు ఉంటాయి. ఫిట్ కాండిడేట్‌కు 25 మార్కులు, నాన్-ఫిట్ కాండిడేట్‌కు 25 మార్కుల కంటే తక్కువ కేటాయిస్తారు.

స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ అసెస్‌మెంట్‌కు 50 మార్కులు కేటాయిస్తారు. విద్యార్హత మరియు జనరల్ ఇంటెలిజెన్స్ లేదా పర్సనాలిటీకి 10 మార్కులు కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్స్‌కు సంబంధించి సెలెక్షన్ అనేది చేస్తారు. కనీసం 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.

దరఖాస్తు విధానం

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్తన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ “క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్” అని కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి.

క్లిక్ చేసిన తర్వాత “నార్తన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అండర్ స్పోర్ట్స్ కోటా” అని కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ బటన్ యాక్టివేట్ అయిన తర్వాత ముందుగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి, యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్ ఇచ్చి ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అవుతుంది. మీరు కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ తో పర్మనెంట్ జాబ్ సాధించవచ్చు. మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Charan  के बारे में
For Feedback - saicharan.usajobs@gmail.com
© 2026 topjobalerts.com | All rights reserved | Made With By TopJobAlerts