---Advertisement---

SSC 60,000 ఉద్యోగాలు 2025: లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలుగులో | Free Jobs Search

By Charan

Published on:

SSC 60,000 ఉద్యోగాలు 2025: లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలుగులో | Free Jobs Search

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇది మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 60,000కి పైగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అధికారిక జాబ్ క్యాలెండర్ విడుదలయ్యింది. పోస్టల్, రైల్వే, ఇన్కమ్ టాక్స్ వంటి వివిధ ప్రభుత్వ శాఖలలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలలో అవకాశాలు ఉన్నాయి.

ఈ భారీ రిక్రూట్‌మెంట్‌లో కింది స్థాయి అటెండర్ ఉద్యోగాల నుంచి పై స్థాయి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల వరకు అన్నింటినీ భర్తీ చేయనున్నారు. పోలీస్ శాఖ, పోస్టల్ డిపార్ట్‌మెంట్, రైల్వే శాఖ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్లతో సహా అనేక ప్రభుత్వ మంత్రిత్వ కార్యాలయాలు, సంస్థలు మరియు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు.


SSC జాబ్ క్యాలెండర్ ముఖ్యాంశాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసిన అధికారిక జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు మరియు అర్హతల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించడం ఉత్తమం.


1. సెలక్షన్ పోస్టులు

వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను సెలక్షన్ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 2
  • దరఖాస్తు గడువు: జూన్ 23
  • పరీక్ష తేదీలు: జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు
  • విద్యార్హతలు: 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత (పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి)
  • వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాలు (పోస్టును బట్టి, వయో సడలింపులు వర్తిస్తాయి)
  • వేకెన్సీలు: సుమారు 2,000
  • జీతం: నెలకు ₹34,000కి పైగా

2. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ C & గ్రేడ్ D

స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 5
  • దరఖాస్తు గడువు: జూన్ 26
  • పరీక్ష తేదీ: ఆగస్టు 12
  • విద్యార్హతలు: ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ / 12వ తరగతి ఉత్తీర్ణత
  • వయోపరిమితి: గ్రేడ్ Cకి 18 నుంచి 30 సంవత్సరాలు, గ్రేడ్ Dకి 18 నుంచి 27 సంవత్సరాలు
  • జీతం: నెలకు ₹40,000కి పైగా
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్

డిగ్రీ అర్హతతో అత్యధిక సంఖ్యలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి SSC CGL నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం.

  • వేకెన్సీలు: 10,000 నుంచి 15,000కి పైగా
  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 9
  • దరఖాస్తు గడువు: జూలై 4
  • టైర్ 1 పరీక్ష తేదీలు: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు
  • విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • వయోపరిమితి: 18 నుంచి 32 సంవత్సరాలు
  • పోస్టులు: గ్రూప్ B, గ్రూప్ C క్యాడర్‌కు సంబంధించిన పోస్టల్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు
  • జీతం: నెలకు ₹35,000కి పైగా
  • ఎంపిక ప్రక్రియ: టైర్ 1 (CBT), టైర్ 2 (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్

ఇంటర్మీడియట్ లేదా డిప్లమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది.

  • వేకెన్సీలు: 2,000 నుంచి 4,000
  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 23
  • దరఖాస్తు గడువు: జూలై 18
  • పరీక్ష నెల: సెప్టెంబర్
  • విద్యార్హతలు: ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లమా ఉత్తీర్ణత
  • వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాలు (వయో సడలింపులు వర్తిస్తాయి)
  • పోస్టులు: లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (DEO)
  • జీతం: నెలకు ₹36,000కి పైగా (లెవెల్ 2 ప్రకారం అలవెన్స్‌లతో కలిపి)
  • ఎంపిక ప్రక్రియ: టైర్ 1, టైర్ 2, పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్

5. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & హవాల్దార్

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

  • వేకెన్సీలు: 4,000కి పైగా
  • నోటిఫికేషన్ విడుదల తేదీ: జూన్ 26
  • దరఖాస్తు గడువు: జూలై 25
  • పరీక్ష నెల: సెప్టెంబర్ లేదా అక్టోబర్
  • విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత (ఎలాంటి ITI లేదా అనుభవం అవసరం లేదు)
  • వయోపరిమితి: MTS ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాలు, హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలు (వయో సడలింపులు వర్తిస్తాయి)
  • పోస్టులు: అటెండర్, హవాల్దార్
  • జీతం: నెలకు ₹35,000 వరకు
  • ఎంపిక ప్రక్రియ: ఒకే పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

6. జూనియర్ ఇంజనీర్లు (JE)

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో డిగ్రీ లేదా డిప్లమా పూర్తిచేసిన వారికి ఇంజనీరింగ్ ఉద్యోగాలు.

  • వేకెన్సీలు: సుమారు 2,000
  • దరఖాస్తు తేదీలు: జూన్ 30 నుంచి జూలై 21 వరకు
  • పరీక్ష తేదీలు: అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు
  • విద్యార్హతలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లమా
  • జీతం: నెలకు ₹70,000 వరకు
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ 1, డిస్క్రిప్టివ్ పరీక్ష పేపర్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్

7. కానిస్టేబుల్ (GD)

10వ తరగతి అర్హతతో భారత ప్రభుత్వ బలగాలలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.

  • వేకెన్సీలు: 35,000కి పైగా
  • నోటిఫికేషన్ విడుదల నెల: అక్టోబర్
  • దరఖాస్తు తేదీలు: త్వరలో ప్రకటిస్తారు
  • అర్హతలు: భారత పౌరులు, 10వ తరగతి ఉత్తీర్ణత
  • వయోపరిమితి: 18 నుంచి 23 సంవత్సరాలు (వయో సడలింపులు వర్తిస్తాయి)
  • పోస్టులు: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), CISF, CRPF వంటి భారత ప్రభుత్వ బలగాలలో కానిస్టేబుల్ పోస్టులు
  • జీతం: నెలకు ₹45,000 వరకు (లెవెల్ 3 ప్రకారం అలవెన్స్‌లతో కలిపి)
  • పరీక్ష సబ్జెక్టులు: జనరల్ ఇంటెలిజెన్స్, జీకే, మ్యాథ్స్, ఇంగ్లీష్ (నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది)
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్

ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా విడుదలైన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించి, ఒక ప్రణాళికతో ముందుకు సాగాలి.

---Advertisement---

Leave a Comment

WhatsApp

📢 తాజా జాబ్స్ కోసం Join అవ్వండి!

ప్రతి రోజు తాజా ఉద్యోగ సమాచారం పొందండి.