---Advertisement---

KGBV రిక్రూట్‌మెంట్ 2024: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో 1075 నాన్-టీచింగ్ ఉద్యోగాలు!

By Charan

Published on:

KGBV రిక్రూట్‌మెంట్ 2024: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో 1075 నాన్-టీచింగ్ ఉద్యోగాలు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఆంధ్రప్రదేశ్‌లో 1095 కేజీబీవీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సర్వశిక్షా అభియాన్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుండి ఖాళీగా ఉన్న 1095 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) టైప్-III మరియు టైప్-IV విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వేకెన్సీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టైప్-III విద్యాలయాల్లో 564 పోస్టులు, టైప్-IV విద్యాలయాల్లో 531 జాబ్‌ల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 టైప్-III కేజీబీవీలలో, అలాగే 210 టైప్-IV కేజీబీవీలలో ఈ పోస్టులు ఉన్నాయి.

ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు

టైప్-III కేజీబీవీలలో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే లేదా నైట్ వాచ్‌మెన్, అటెండర్, స్వీపర్ మరియు స్కావెంజర్ జాబ్‌లు ఉన్నాయి. టైప్-IV కేజీబీవీలలో వార్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ లాంటి వేకెన్సీలకు నోటిఫికేషన్ ఇచ్చారు.

ముఖ్యమైన పోస్టుల వారీ ఖాళీలు:

  • వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు: 77
  • కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు: 134
  • ఏఎన్ఎం: 110
  • అకౌంటెంట్: 11
  • అటెండర్: 28
  • హెడ్ కుక్ (టైప్-III): 22
  • అసిస్టెంట్ కుక్ (టైప్-III): 89
  • డే వాచ్ ఉమెన్: 18
  • నైట్ వాచ్ ఉమెన్: 26
  • స్కావెంజర్: 33
  • స్వీపర్: 16
  • వార్డెన్: 86
  • పార్ట్ టైం టీచర్: 122
  • చౌకీదారు: 77
  • హెడ్ కుక్ (టైప్-IV): 76
  • అసిస్టెంట్ కుక్ (టైప్-IV): 170

ఈ జాబ్‌లకు అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కేజీబీవీ పాఠశాలలు బాలికల కోసం మాత్రమే కాబట్టి, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వయో పరిమితి

జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు 45 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సును 01.07.2025 నాటికి లెక్కించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 50 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నవారు 52 సంవత్సరాల వరకు, ఎక్స్-సర్వీస్‌మెన్ మహిళలు 45 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

విద్యార్హతలు

  • హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే అండ్ నైట్ వాచ్‌మెన్, చౌకీదార్, అటెండర్: ఈ జాబ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తప్పనిసరి కాదు. 10వ తరగతి మార్క్స్ కార్డ్ ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.
  • కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్: ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాంతో పాటు PGDCM (పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ కంప్యూటర్ మేనేజ్‌మెంట్ లేదా అప్లికేషన్స్) సర్టిఫికెట్ ఉండాలి. లేదా, డిగ్రీలో కంప్యూటర్స్ చదివి ఉంటే (బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ వంటివి) నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు, PGDCM అవసరం లేదు.
  • వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్: 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మ్యూజిక్, డాన్స్, స్వివింగ్, టైలరింగ్ లేదా వీవింగ్ లో డిప్లమా లేదా సర్టిఫికెట్ ఉండాలి. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తప్పనిసరిగా టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ ఉండాలి.
  • అకౌంటెంట్: బీకాం లేదా బీకాం కంప్యూటర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వార్డెన్: బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఓసి అభ్యర్థులకు డిగ్రీలో 50% మార్కులు, బీసి అభ్యర్థులకు 45% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పర్సనల్ డిజబిలిటీ అభ్యర్థులకు 40% మార్కులు వచ్చి ఉండాలి. దాంతో పాటు బీఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • పార్ట్ టైం టీచర్స్: బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసి ఉండాలి. దాంతో పాటు బీఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • ఏఎన్ఎం (ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫరీ): ఇంటర్మీడియట్‌లో రెండేళ్ల ఎంపిహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా, ఇంటర్మీడియట్ పాస్ అయి ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్: తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ మరియు అప్లికేషన్ విధానం

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఉండదు, దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు నేరుగా సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులను నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరవచ్చు. రోస్టర్ పాయింట్స్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) వర్తిస్తాయి. లోకల్ రిజర్వేషన్లు ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుని వర్తింపజేస్తారు.

ముఖ్యమైన తేదీలు (2026):

  • నోటిఫికేషన్ విడుదల (ప్రెస్ రిలీజ్): జనవరి 2
  • దరఖాస్తుల స్వీకరణ (ఏపీసీ ఆఫీస్ వద్ద): జనవరి 3 నుండి జనవరి 11 వరకు
  • ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ (మండలం వారీగా): జనవరి 12
  • సెలక్షన్ లిస్ట్ డిస్‌ప్లే (నోటీస్ బోర్డులో): జనవరి 19
  • అభ్యంతరాలు సమర్పణ: జనవరి 22 లోపు
  • ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ లెటర్స్: జనవరి 22
  • ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్: జనవరి 23 & 24
  • 1:1 మెరిట్ లిస్ట్ తయారీ: జనవరి 28
  • లిస్ట్ జిల్లా సెలక్షన్ కమిటీకి పంపడం: జనవరి 29
  • ఏపీ స్టేట్ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆమోదం: జనవరి 31 లోపు
  • ఉద్యోగంలో చేరే అవకాశం: ఫిబ్రవరి 1

దరఖాస్తులు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) కార్యాలయం, విద్యా శాఖ వద్ద ఆఫ్లైన్ మోడ్‌లో సమర్పించాలి.

ఎంపిక కమిటీ ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖ అధికారి, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లు సభ్యులుగా ఉంటారు.

వేతనం ఈ జాబ్‌లకు సంబంధించి వేతనం ఎంత ఉంటుందనేది ఇంకా తెలియజేయలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం వేతనం ఉంటుంది. పోస్టును బట్టి వేతనం మారుతుంది, కనిష్టంగా నెలకు రూ. 15,000 కు పైగా ఉండే అవకాశం ఉంది.

---Advertisement---

Leave a Comment